తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబాన్ని వదిలి.. మరో మహిళను పెళ్లాడిన తల్లి - madhurai bench

భర్త, బిడ్డను విడిచి మరో మహిళ కోసం వెళ్లిపోయింది ఆ భార్య. 12వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్న ప్రేయసిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడు మదురైలో జరిగింది. తొలుత భార్య ఆచూకీ కోసం మదురై బెంచీని సంప్రదించిన భర్త తరఫు కుటుంబం.. ఆ విషయం తెలుసుకుని షాక్​ అయ్యింది. బిడ్డ కోసం తల్లిని తిరిగి పంపాలని ధర్మాసనానికి విన్నవించుకుంది. కానీ ఆమె మాత్రం తన ప్రేయసిని విడిచిపెట్టి వెళ్లలేనని తేల్చిచెప్పింది. ఇరువైపులా వాదనలు విన్న బెంచ్​.. ఆ మహిళలకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Tamil Nadu HC
బిడ్డను వదిలి మరో మహిళ కోసం వెళ్లిన తల్లికి హైకోర్టు మద్దతు!

By

Published : Oct 22, 2021, 12:56 PM IST

తమిళనాడు మదురై పనన్​గడికి చెందిన శరవణన్​, జయశ్రీకి (24) 2018లో వివాహం జరిగింది. 2019లో వారికి ఓ బాబు పుట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త, బిడ్డను వదిలేసి జయశ్రీ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. భార్య కోసం శరవణన్​ చాలా రోజులు అన్వేషించినా ఫలితం దక్కలేదు.

ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ కుటుంబం. నెలలు గడిచినా ఆచూకీ లభించలేదు. అనంతరం మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్​లో హెబియస్​ కార్పస్​ పిటిషన్​ వేశాడు శరవణన్​. పోలీసులు తన భార్య ఆచూకీ కనుగొనేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు జడ్జీలు అంగీకరించి.. ఆ పనిని పోలీసులకు అప్పగించారు.

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు జయశ్రీ చెన్నైలో దర్శనమిచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను ఇంటిని విడిచిపెట్టి వచ్చినందుకు జయశ్రీ చెప్పిన కారణం విని పోలీసులు షాక్​ అయ్యారు.

చెన్నైలో దుర్గాదేవీ అనే మహిళతో కలిసి జీవిస్తోంది జయశ్రీ. వీరిద్దరికి 12వ తరగతి నుంచి పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కూడా వారి మధ్య బంధం కొనసాగింది. ఓ రోజు జయశ్రీ విషయం ఆమె ఇంట్లో తెలిసిపోయింది. ఆమెను తిట్టి హడావుడిగా పెళ్లి ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. అలా దుర్గాదేవీని విడిచి.. శరవణన్​ను పెళ్లి చేసుకుంది జయశ్రీ.

విడిచి ఉండలేక..

వివాహం జరిగిన తర్వాత కూడా దుర్గాదేవీని మర్చిపోలేకపోయింది జయశ్రీ. ఆమెను వెతుక్కుంటూ వెళాలని నిర్ణయించుకుంది. కానీ అప్పుడే ఆమె గర్భవతి అని తెలిసి ఆ ప్రణాళికను విరమించుకుంది. బిడ్డ పుట్టిన కొన్ని నెలలకు అందరిని వదిలేసి చెన్నై వెళ్లిపోయింది. దుర్గాదేవీని వెతికి పట్టుకుని ఆమెను పెళ్లి చేసుకుంది.

ఈ వ్యవహారంపై ఈ నెల 20న విచారణ చేపట్టంది మదురై బెంచ్​. జయశ్రీకి రెండేళ్ల పిల్లాడు ఉన్నాడని, ఆమె వెళ్లిపోతే బిడ్డ పరిస్థితి దారుణంగా ఉంటుందని, అందుకే ఐపీసీ సెక్షన్​ 317 కింద ఆమెను భర్తతో పంపాలని శరవణన్​ తరఫు న్యాయవాది వాదించారు. ఇందుకు బదులుగా.. 'నేను-దుర్గాదేవీ 12వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్నాం. నాకు దుర్గాదేవీతో కలిసి జీవించాలని ఉంది,' అని జస్టిస్​ భారతీదాసన్​, జస్టిస్​ ఆనందితో కూడిన బెంచ్​కు విన్నవించుకుంది జయశ్రీ.

ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. జయశ్రీ ఒక మేజర్​ అని, ఆమె దుర్గాదేవీతో వెళ్లొచ్చని తీర్పునిచ్చింది.

ఇదీ చూడండి:-లైంగిక దాడిలో ప్రతిఘటించకపోతే సమ్మతించినట్లేనా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details