పట్టుచీరలు నేస్తూ పొట్ట పోషించుకునే కుటుంబం వారిది. ఆ కుటుంబంపై ప్రకృతి పెను విధ్వంసం సృష్టించబోయింది. కానీ, ఆ ఇంటిపెద్ద సమయస్ఫూర్తి కారణంగా.. అదృష్టవశాత్తు ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు.. ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
అసలేం జరిగింది..?
ఈరోడ్ జిల్లాలోని(Tamil nadu erode news) అంతియూర్ ప్రాంతంలో నివసించే ఓ చేనేత కార్మికుడి(52) ఇల్లు... ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నానింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఒంటి గంటకు నేలపై పెచ్చులు ఊడిపడటాన్ని ఆ వ్యక్తి గమనించాడు. ఇల్లు కూలిపోయే ప్రమాదం(House collapse escape) ఉందని గ్రహించిన అతడు.. తన కుటుంబాన్ని అప్రమత్తం చేశాడు.