Couple Chain Snatching: సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రేమికులను తమిళనాడు కోయంబత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియురాలు బైక్ నడుపుతూ చిరునామా అడుగుతుండగా.. ప్రియుడు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను ప్రసాద్(20), తేజస్విని(20) గా గుర్తించారు.
ఇదీ జరిగింది: కోయంబత్తూరులోని తొండముత్తూర్ ప్రాంతానికి చెందిన కాలియమ్మాళ్ అనే మహిళ ఏప్రిల్ 28న పొలానికి సమీపంలో మేకను మేపుతోంది. స్కూటర్‌పై వచ్చిన ప్రేమికులు.. ఆ మహిళను చిరునామా అడిగారు. ఆమె వారికి అడ్రస్ చెప్తుండగా.. వెనుక కూర్చున్న ప్రసాద్ హఠాత్తుగా మహిళ మెడలోని గొలుసు లాగేశాడు. అనంతరం వారిద్దరూ అక్కడినుంచి పారిపోయారు. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీలను పరిశీలించి నిందితులను అరెస్ట్ చేశారు.