Factory manager attacking girl: పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం పరాయి ప్రాంతం నుంచి వచ్చిన యువతిపై ఓ ఫ్యాక్టరీ మేనేజర్ కర్కశంగా ప్రవర్తించాడు. ఆమెను కర్రతో కొడుతూ దారుణంగా హింసించాడు. నొప్పితో ఆమె విలవిలాడుతున్నప్పటికీ.. అతను తన దుశ్చర్యను ఆపలేదు. ఈ ఘటన తమిళనాడు కొయంబత్తూరులో జరిగింది.
పనికి రాలేదని..
Girl beaten in Coimbatore: "ఝార్ఖండ్‌కు చెందిన బాధిత యువతి.. ఉపాధి కోసం కోయంబత్తూరుకు వచ్చి, ఓ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. అయితే.. ఆమె పనికి హాజరయ్యేందుకు నిరాకరించగా.. ఆమెపై ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ముత్తయ్య కర్రతో దాడి చేశాడు" అని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆమెను కాలితో తన్నేందుకు సదరు మేనేజర్ యత్నించినట్లు కనిపించింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.