ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కలిశారు. సీఎంగా అయిన తర్వాత తొలిసారి దిల్లీ వెళ్లిన డీఎంకే నేత.. మోదీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కు రెండు ఫొటోలను జత చేసింది.
PM Modi: ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం - ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది.
తమిళనాడు సీఎం
ప్రధానితో అరగంట సమయం మాట్లాడిన స్టాలిన్.. రాష్ట్రానికి మరిన్ని కరోనా టీకా డోసులు అందించాలని అభ్యర్థించారు. అలాగే రాష్ట్రంలో చెన్నైకు సమీపంలోని చెంగల్పేట్, నీలగిరిల్లో టీకా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలోనే జీఎస్టీ పన్నుల వాటా సహా రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరినట్లు స్టాలిన్ తెలిపారు.
ఇదీ చూడండి:ఎల్జేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా పశుపతి!
Last Updated : Jun 17, 2021, 8:57 PM IST