తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా.. ఆ రాష్ట్ర సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాళులు అర్పించారు. చెన్నైలోని ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేశారు.
జయలలిత విగ్రహానికి పూలమాల సమర్పిస్తున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వం జయలలిత నెచ్చెలి, బహిష్కృత ఏఐఏడీఎంకే నేత శశికళ కూడా జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి శశికళతో పాటు టీటీవీ దినకరన్ కూడా హాజరయ్యారు.
జయలలిత చిత్రపటానికి పూలహారం వేస్తున్న శశికళ జయలలిత జయంతి సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆమెను గుర్తుచేసుకున్నారు. జయలలితాజీ ప్రజా అనుకూల విధానాలతో అట్టడుగువర్గాల వారిని శక్తిమంతం చేసేందుకు కృషి చేశారని అన్నారు. నారీ శక్తిని బలోపేతం చేసేందుకు ఆమె గొప్పగా ప్రయత్నించారని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి:పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు