తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Tamil Nadu chopper crash: స్వగ్రామానికి జవాన్ల పార్థివదేహాలు- భారీగా జనం హాజరు

Tamil Nadu chopper crash: హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లు నాయక్​ గుర్ సేవక్ సింగ్​, నాయక్ జితేంద్ర సింగ్ మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

coonoor Helicopter crash victims
గుర్​సేవక్ సింగ్ అంత్యక్రియలు

By

Published : Dec 12, 2021, 1:40 PM IST

Helicopter crash victims body: తమిళనాడు కున్నూర్​లో బుధవారం జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నాయక్​ గుర్​సేవక్ సింగ్ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పంజాబ్​ తరన్​ తారన్ జిల్లాలోని దోడె సోదియాన్ గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. సింగ్ మృతదేహానికి కుటుంబ సభ్యులు, స్థానికులు నివాళులు అర్పించారు. జవానును చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.

స్వగ్రామానికి చేరిన గుర్​సేవక్ సింగ్ పార్థివదేహం
గుర్​సేవక్ సింగ్ పార్థివ దేహం తరలింపు

Naik Jitendra Kumar death: ఇదే ప్రమాదంలో మరణించిన నాయక్​ జితేంద్ర కుమార్ మృతదేహాన్ని సైతం సైనికాధికారులు మధ్యప్రదేశ్​లోని ఆయన స్వగ్రామానికి తరలించారు. ఆదివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పార్థివదేహానికి నివాళులు అర్పించడానికి జనం భారీగా తరలివచ్చారు.

జితేంద్ర కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు
సైనిక లాంఛనాలతో మృతదేహం తరలింపు

ABOUT THE AUTHOR

...view details