తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాన్వాయ్​ను సగానికి తగ్గించుకున్న సీఎం!

ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణించే సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin convoy).. అధికారులను ఆదేశించారు. తన కాన్వాయ్​లో వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి (MK Stalin news) ఆదేశాల ప్రకారం సీఎం కాన్వాయ్​లో వాహనాలను 14 నుంచి ఏడుకు తగ్గించారు అధికారులు.

tamilnadu cm convoy
తమిళనాడు సీఎం కాన్వాయ్

By

Published : Oct 10, 2021, 12:57 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin latest news).. తన భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం వెంట ప్రయాణించే కాన్వాయ్​లో (MK Stalin convoy) వాహనాల సంఖ్యను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. తాను ప్రయాణించే సమయంలో ప్రజల వాహనాలను నిలిపివేసి వారికి ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు.

చెన్నై అడయార్ సమీపంలో ఉన్న శివాజీ గణేశన్ స్మారకాన్ని కొద్దిరోజుల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్ (MK Stalin news) సందర్శించారు. ఈ సమయంలో అడయార్​కు వెళ్లే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 25 నిమిషాల పాటు వాహనాలను నిలిపివేశారు.

ట్రాఫిక్​లో చిక్కుకుపోయిన వారిలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనంత వెంకటేశన్ సైతం ఉన్నారు. పోలీసుల ఆంక్షల కారణంగా ఆయన కోర్టుకు 25 నిమిషాలు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. దీనిపై రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి.. న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు.

14 నుంచి 7కు..

ఈ నేపథ్యంలోనే.. స్టాలిన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం సీఎస్, డీజీపీతో స్టాలిన్ సమావేశమయ్యారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు సైతం వెంటనే చర్యలు చేపట్టారు. సీఎం కాన్వాయ్​లో (MK Stalin convoy) వాహనాల సంఖ్యను 14 నుంచి ఏడుకు తగ్గించారు. సాధారణ ట్రాఫిక్​ను ఆపకుండా సీఎం వాహనం వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details