కొవిడ్ విధులు నిర్వహిస్తున్న తమిళనాడు రాష్ట్ర పోలీసులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం బోనస్ ప్రకటించారు. ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున అందించనున్నట్లు స్పష్టం చేశారు.
సహాయక చర్యల్లో భాగంగా 14 రకాల నిత్యావసర సరకులను ప్రజలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల హామీలో ప్రకటించిన విధంగా మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారికి రెండో విడత కింద రూ. 2000 ఆర్థిక సాయం మంజూరు చేశారు. ఇప్పటికే గత నెల తొలి విడత కింద రెండు వేల రూపాయలను అందించారు.