కంటైనర్లో అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను చెన్నై నౌకాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 7.4 మెట్రిక్ టన్నులున్న ఎర్ర చందనం విలువ రూ. 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
రూ. 5.6 కోట్లు విలువైన ఎర్ర చందనం పట్టివేత - ఎర్రచందనం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న 7.4 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనాన్ని చెన్నై నౌకాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎర్రచందనం పట్టివేత
ఎర్రచందనాన్ని కంటైనర్లో నింపిన దుండగులు.. అనుమానం రాకుండా పైన గ్రానైట్ రాళ్లతో కప్పేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :మే 10 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు