తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2021, 8:28 PM IST

ETV Bharat / bharat

ఆరేళ్ల 'రౌడీ మోడల్​'.. ర్యాంప్​ వాక్​ చేస్తే అదుర్స్​

మూడేళ్లకే మోడలింగ్​లో ర్యాంప్​ వాక్​లు.. అతడి స్టైల్​కి జాతీయస్థాయి అవార్డులు దాసోహం.. ఆరేళ్లకే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం.. 'రౌడీ మోడల్​'గా పేరు, రైజింగ్ స్టార్​గా కీర్తి.. ఇదీ కోయంబత్తూర్​కు చెందిన బాలుడి ఘనత. మరి ఆ బాలుడిని చూసేద్దామా..

model rana shivakumar
మోడల్​ రానా శివకుమార్

ఆరేళ్ల 'రౌడీ మోడల్​'.. ర్యాంప్​ వాక్​ చేస్తే అదుర్స్​

మోడలింగ్ అంటే ఓ రంగురంగుల ప్రపంచం. అందులో రాణిస్తే, ఇక జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది అంత సులభమైన విషయం కూడా కాదు! అంత కష్టమైన రంగాన్ని ఎంచుకున్న ఓ ఆరేళ్ల చిచ్చరపిడుగు.. మోడలింగ్​లో దుమ్మురేపుతున్నాడు. ర్యాంప్​ వాక్​తో, స్టైలిష్​ లుక్స్​తో ఇప్పటికే ఎన్నో అవార్డులు తన సొంతం చేసుకున్నాడు. అతనే.. తమిళనాడుకు చెందిన రానా శివకుమార్​. సోమవారం నుంచి దుబాయ్​లో జరగనున్న ఇంటర్నేషనల్​ జూనియర్​ ఫ్యాషన్​ షోలో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్న రానా.. విజయం తనదేనని ధీమాగా ఉన్నాడు.

రైసింగ్ స్టార్ రానా శివకుమార్

రానా తల్లిదండ్రులు కోయంబత్తూర్​లో నివాసముంటున్నారు. రానా తండ్రి శివకుమార్​.. ఓ టెక్స్​టైల్​ వ్యాపారి. తల్లి ఓ సెలూన్​కు ఓనర్​. మూడేళ్ల వయస్సులోనే ర్యాంప్​ వాక్​ చేసి రానా అదరుగొట్టాడని తల్లి గోమతి చెబుతోంది.

"కోయంబత్తూర్​లో నేను ఓ సెలూన్ నడుపుతున్నాను. మూడేళ్ల క్రితం.. షాప్​కు వచ్చిన ఓ ఫ్యాషన్​ ఏజెంట్​ నా కొడుకుని చూశాడు. రానాది ఫొటోజెనిక్ ఫేస్​ అని కితాబిచ్చాడు. వారు నిర్వహిస్తున్న మోడలింగ్ షోకు రానాని పంపించమన్నాడు. ఒకసారి ప్రయత్నిద్దామని తీసుకెళ్లాను. తొలుత కొంత ఆలోచించాము. కానీ ఇప్పుడు రానాని చూసి గర్వపడుతున్నాము."

-గోమతి, రానా తల్లి

అలా.. కోయంబత్తూర్​లో నిర్వహించిన మోడలింగ్​లో తొలిసారి పాల్గొన్న రానా..​ అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.​ ఏ పోటీల్లో పాల్గొన్నా.. అవార్డులు అతన్నే వరించేవి. ఇప్పటివరకు 14 అవార్డులు, ఓ మెడల్​ను దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో 'రైజింగ్​ స్టార్' ట్యాగ్​ను కూడా సొంతం చేసుకున్నాడు. తన లుక్స్​తో.. 'రౌడీ మోడల్'​గా పేరు సంపాదించుకున్నాడు.

బహుమతితో రౌడీ మోడల్

రానా మోడలింగ్​ వెనక అతని తండ్రి శివకుమార్​ది​ కీలక పాత్ర. ర్యాంప్​ వాక్​ దగ్గరి నుంచి, మోడలింగ్​ వరకు తనకు తెలిసినవన్నీ ఇంట్లోనే రానాకు నేర్పించాడు. దుబాయ్​లో జరగనున్న ఇంటర్నేషనల్​ జూనియర్​ ఫ్యాషన్​ షోలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు రానా తెలిపాడు.

తల్లిదండ్రులతో రానా శివకుమార్​

"నా పేరు 'రౌడీ మోడల్' రానా శివకుమార్​. నా వయస్సు ఆరేళ్లు. మోడలింగ్, కర్రసాము(సిలంబం)​ నా అలవాట్లు. మోడలింగ్​ అంటే నాకు చాలా ఇష్టం. దుబాయ్​లో జరిగే పోటీల్లోనూ అవార్డ్ గెలుస్తాను."

-రానా శివకుమార్​

రానా విజయాల పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలుడికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం చదువు, మోడలింగ్​లపై శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. అయితే భవిష్యత్తులో తాను నేవీలో పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలిపాడు రానా శివకుమార్​.

ఇదీ చదవండి:15వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల జెండా రెపరెపలు

ముగిసిన చార్​ధామ్ యాత్ర- బద్రీనాథ్​ ఆలయం మూసివేత

ABOUT THE AUTHOR

...view details