తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితిపై చైనాతో మరోసారి కమాండర్ స్థాయి చర్చలు జరపటంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. తెలంగాణ హైదరాబాద్ దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. తూర్పు లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడారు.
"చైనాతో మరో విడత చర్చల కోసం సిద్ధంగా ఉన్నాం. కమాండర్ స్థాయి సమావేశాల జరిపే ప్రతిపాదన ఉంది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సరిహద్దులో పరిస్థితులపై క్షేత్రస్థాయిలో భారత దళాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి."
-ఆర్కేఎస్ భదౌరియా, ఐఏఎఫ్ చీఫ్ మార్షల్
ఆధునాతన సాంకేతికతలను ఐఏఎఫ్ వినియోగించుకుంటోందని భదౌరియా తెలిపారు. 2022 నాటికి భారత వైమానిక దళ అమ్ముల పొదిలో 36 రఫేల్ యుద్ధ విమానాలు తప్పక చేరుతాయని స్పష్టం చేశారు.