జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా అక్కడ పర్యటిస్తోంది డీలిమిటేషన్ కమిషన్. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. నియోజకవర్గాలు, జిల్లాల సరిహద్దులు సరిగా లేవని, దాంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా నివేదికను రూపొందిస్తామని.. దానిని పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుని నియోజకవర్గాల పునర్విభజనపై తుది ముసాయిదా రూపొందిస్తామన్నారు.
'ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా' - జమ్ముకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన
జమ్ముకశ్మీర్‌లోని నియోజకవర్గాల పునర్విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా నివేదిక సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు.
!['ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముసాయిదా' Sushil Chandra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12403870-thumbnail-3x2-susil.jpg)
1981లో తొలిసారి పూర్తి స్థాయి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారని.. అయితే ఆ కమిషన్ దాదాపు 14 ఏళ్ల తర్వాత 1995లో నివేదికను సమర్పించిందన్నారు సుశీల్ చంద్ర. అప్పట్లో 1981 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించడం వల్ల పునర్విభజనకు వీలుపడలేదని గుర్తు చేశారు. 1995 నాటికి జమ్ముకశ్మీర్‌లో 12 జిల్లాలే ఉన్నాయని.. ఆ సంఖ్య ఇప్పుడు 20కు పెరిగిందన్నారు. మండలాల సంఖ్య కూడా 58 నుంచి 270కు పెరిగిందని.. నియోజకవర్గ సరిహద్దులు ఒకదానికితో ఒకటి కలిసిపోయాయని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ట్విట్టర్ యూజర్‌కు మోదీ బర్త్‌డే విషెస్- నెటిజన్ల ఆశ్చర్యం