తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాల్యాను తీసుకురావడంలో ఆలస్యం అందుకే..' - విజయ్​ మాల్యా తాజా వార్తలు

పరారీలో ఉన్న లిక్కర్​ కింగ్​ విజయ్​ మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామని సుప్రీం న్యాయస్థానానికి తెలిపింది కేంద్రం. అయితే.. ఇందుకు కొన్ని చట్టపరమైన ఆటంకాలు ఎదురవుతున్నాయని వివరించింది.

Taking all efforts to extradite fugitive businessman Vijay Mallya: Centre to SC
'విజయ్​ మాల్యాను అప్పగించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం'

By

Published : Jan 18, 2021, 5:42 PM IST

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్​లో తలదాచుకుంటున్న లిక్కర్​ కింగ్​ విజయ్​ మాల్యాను అప్పగించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని సుప్రీం కోర్టుకు తెలిపింది కేంద్రం. అయితే.. కొన్ని చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నందున ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోందని పేర్కొంది.

ఇదీ చదవండి:విజయ్ మాల్యాకు మరో షాక్​- ఫ్రాన్స్​లో ఆస్తులు సీజ్​

తొలుత మాల్యాను యూకే నుంచి రప్పించే విషయమై.. విదేశాంగ శాఖాధికారి దేవేశ్​ ఉత్తమ్​ తనకు రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా. పరారీలో ఉన్న మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు.. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తోందని వివరించారు. అనంతరం ఈ అంశానికి సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించేందుకు మరింత సమయం కావాలని కోర్టును కోరారు మెహతా. ఈ మేరకు జస్టిస్​ యూయూ లలిత్​, అశోక్​ భూషణ్​తో కూడిన ధర్మాసనం.. విచారణను మార్చి 15కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బందుల్లో విజయ్​ మాల్యా!

ABOUT THE AUTHOR

...view details