కరోనా చికిత్సలో కీలకమైన రెమిడెసివిర్ ఔషధాలను బ్లాక్ మార్కెట్లో అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ సోమవారం తెలిపారు. రెమిడెసివిర్ నిల్వలపై ఫార్మా సెక్రటరీతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు ట్విట్టర్ వేదికగా చెప్పారు.
"ఫార్మా సెక్రెటరీతో రెమిడెసివిర్ నిల్వలపై సమీక్ష నిర్వహించాం. ఈ ఔషధ ఉత్పత్తిదారులతో ప్రభుత్వం తరుచూ సంప్రదింపులు జరుపతోంది. ఉత్పత్తిదారులను సంప్రదించి, కావాల్సిన ఉత్పత్తిపై ప్రణాళికలను సిద్ధం చేశాం. రెమిడెసివిర్ వయల్స్‌ను సేకరించేవారిపై, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారిపై రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతర పర్యవేక్షణ జరపాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-డీవీ సదానంద గౌడ, కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి