తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హీట్​వేవ్​పై మోదీ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక సూచనలు - మోదీ సమీక్షా సమావేశం

PM Review On Heatwave: ఐరోపా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాకాలం ముందస్తు చర్యలకు సంబంధించిన పరిస్థితిపై ప్రధాని సమీక్షించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

PM Review
PM Review

By

Published : May 5, 2022, 10:03 PM IST

PM Review On Heatwave: దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షాకాలం ముందస్తు చర్యలకు సంబంధించిన పరిస్థితిపై ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. వేడిగాలులు, అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణనష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారు. 'వరద సన్నద్ధత ప్రణాళికలు' సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని జాతీయ విపత్తు రక్షణ దళాన్ని (ఎన్డీఆర్ఎఫ్​) ఆదేశించారు.

తీర ప్రాంతాల్లో వాతావరణ హెచ్చరికలను సకాలంలో ప్రసారం చేయడమే కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలకు ఉపాక్రమించాలన్నారు. ఈ హెచ్చరికలను ప్రజలకు సకాలంలో అందించేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకోవాలని మోదీ సూచించారు. నీరు కలుషితం కాకుండా చూడాలని.. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందకుండా తాగునీటి నాణ్యతను పర్యవేక్షించాలని మోదీ ఆదేశించారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి పీఎం ప్రిన్సిపల్​ సెక్రటరీ, సలహాదారులు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మూడు రోజుల పాటు ఐరోపాలో పర్యటించిన ఆయన.. భారత్​కు చేరుకున్న రోజే ఈ కీలక సమావేశాన్ని నిర్వహించారు.

ఇదీ చదవండి:13 శస్త్రచికిత్సలు.. 100కు పైగా ఫ్రాక్చర్స్​.. వైకల్యాన్ని ఎదుర్కొని..

ABOUT THE AUTHOR

...view details