ఉత్తర్‌ప్రదేశ్‌లో బారియా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ పేరును త్వరలో రామ్ మహల్ లేదా శివ మహల్‌గా మారుస్తామని శనివారం వ్యాఖ్యానించారు.
''తాజ్ మహల్ పేరును 'రామ్ మహల్'గా మారుస్తాం'' - హిందూ పేర్లతో తాజ్ మహల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ పేరును త్వరలోనే రామ్ మహల్ లేదా శివ మహల్‌గా మారుస్తామని అన్నారు.
![''తాజ్ మహల్ పేరును 'రామ్ మహల్'గా మారుస్తాం'' Taj Mahal will soon be renamed as 'Ram Mahal': BJP MLA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10996748-888-10996748-1615647796184.jpg)
'తాజ్ మహల్ పేరును 'రామ్ మహల్'గా మారుస్తాం'
విలేకరులతో మాట్లాడుతున్న భాజపా ఎమ్మెల్యే సురేంద్ర సింగ్
భారతీయ సంస్కృతిని ముస్లిం పాలకులు నాశనం చేశారని సురేంద్ర సింగ్ ఆరోపించారు. అయితే.. ఇప్పుడు ఆ సంస్కృతిని పునరుద్ధరించడానికి స్వర్ణశకం వచ్చిందని అన్నారు. శివాజీ వంశానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. తాజ్ మహల్ పేరును తప్పక మారుస్తారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:యశ్వంత్ సిన్హా చేరిక తృణమూల్‌కు లాభమా?