తాజ్‌మహల్ సహా వివిధ చారిత్రక కట్టడాల సందర్శన జూన్16 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ మేరకు పురావస్తు శాఖ తెలిపింది.
ఒకసారి 650 మందికి మాత్రమే తాజ్‌మహల్ పరిసరాల్లోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఇతర కట్టడాల విషయంలో ఇలాంటి నిబంధనలు లేవని వెల్లడించారు.
తాజ్‌మహల్ ప్రాంగణంలో పర్యటకులు విధిగా వ్యక్తిగత దూరం పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. చారిత్రక కట్టడాలను తాకకూడదని పలు సూచనలు చేశారు.
ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాలని తెలిపారు. వాటర్ బాటిల్, శానిటైజర్‌ను ఎవరికివారు తెచ్చుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:పవన్ కోసం తాజ్ మహల్, చార్మినార్..?