Taj mahal aeroplane: ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు అత్యంత సమీపంలో ఓ విమానం చక్కర్లు కొట్టింది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను(సీఐఎస్ఎఫ్) నివేదిక ఇవ్వాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సోమవారం కోరింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత విభాగానికి అందించినట్లు పేర్కొంది.
నిషేధం..
తాజ్‌మహల్ వద్ద భద్రతను సీఐఎస్ఎఫ్ చూస్తుంటుంది. ఈ చారిత్రక కట్టడం పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్లపై ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా విమానం అంత దగ్గరనుంచి వెళ్లగా.. పర్యటకులు భయాందోళనకు గురయ్యారు.