తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉయ్యాల ఊగుతూ ముగ్గురు పిల్లలు మృతి! - కర్ణాటకలో ముగ్గురు చిన్నారుల మృతి

సరదాగా ఆడుకోవాల్సిన వయసులో.. ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కర్ణాటకలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలతో.. ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

children died, karnatka
చిన్నారులు మృతి, కర్ణాటక

By

Published : Jul 1, 2021, 3:54 PM IST

చీరతో ఉయ్యాల కట్టుకుని ఆనందంగా ఆడుకుందామనుకున్న చిన్నారులు మృత్యుఒడికి చేరారు. అనుకోకుండా ఆ చీర మెడచుట్టూ బిగుసుకుపోవడం వల్ల ఊపిరి అందక ప్రాణాలు విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ బాధాకరమైన ఘటన కర్ణాటక గణగూరు తాలూక ఉంజిగనహళ్లిలో జరిగింది.

అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన చిన్నారులు
ఉయ్యాలలా చీరను కట్టిన చిన్నారులు

ఉంజిగనహళ్లికి చెందిన రాజీవ్, జయంతి దంపతుల కుమారుడు పూర్ణేష్(12), కుమార్తె ప్రతీక్ష(14) ఈ ఘటనలో మృతిచెందారు. సోమవారం.. కుటుంబ సభ్యులెవరూ ఇంటి దగ్గర లేని సమయంలో ఈ ఘటన జరగడం వల్ల చిన్నారుల మృతిపట్ల అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అనుమానస్పద రీతిలో బాలుడు మృతి

మరో అబ్బాయి ఇలానే..

దక్షిణ కన్నడ సుళ్య తాలూక చెంబు గ్రామానికి చెందిన మరో బాలుడు భరత్(10) అనుమానాస్పద రీతిలో మరణించాడు. అయితే.. ఉయ్యాల ఊగుతుండగా బాలుడు మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:సోషల్​ మీడియాలో కొత్త స్టార్.. 'సిలిండర్​ మ్యాన్​'

ABOUT THE AUTHOR

...view details