తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచారం జరిగిన 26 రోజుల్లోనే దోషికి మరణశిక్ష - Rajasthan POCSO Court latest verdict

బాలికపై అత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష విధించింది రాజస్థాన్​లోని పోక్సో న్యాయస్థానం. నేర ఘటన జరిగిన 26 రోజుల్లోనే తీర్పు వెల్లడించింది. దోషి మరణ దండనకు అర్హుడని వ్యాఖ్యానించింది.

Swift action: Man gets death for raping minor girl in Rajasthan
పోక్సో కోర్టు కీలక తీర్పు- అత్యాచార కేసులో దోషికి మరణశిక్ష

By

Published : Mar 18, 2021, 6:43 AM IST

రాజస్థాన్‌లోని పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఝున్​ఝునూ జిల్లాలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకునికి మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన 26 రోజుల్లోనే పోక్సో కోర్టు.. సదరు యువకున్ని దోషిగా తేల్చింది. ఇది దారుణమైన నేరమన్న కోర్టు.. దోషి మరణశిక్షకు అర్హుడని వ్యాఖ్యానించింది.

ఇదీ జరిగింది

తన ఇంటి సమీపంలోని పొలంలో ఆడుకుంటున్న చిన్నారిని.. 21 ఏళ్ల సునీల్ కుమార్​ అపహరించి, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 19న జరిగిన ఈ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.

వేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. 10రోజుల్లో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి తీర్పును పోక్సో కోర్టు బుధవారం వెలువరించింది.

ఇదీ చూడండి:ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details