కేరళలో ప్రకంపనలు సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలే.. తనను మాజీ మంత్రి సురేంద్రన్, మాజీ స్పీకర్ లైంగికంగా వేధించారని ఆరోపించింది. తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ స్పీకర్ శ్రీధర్కృష్ణన్ స్పందించిన వెంటనే ఆయనకు సంబంధించిన ఏడు చిత్రాలను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది స్వప్న సురేశ్. 'సార్ ఇదే మీకు నా సమాధానం' మీకు ధైర్యం ఉంటే నాపైన పరువు నష్టం కేసు పెట్టాలని.. ఫేస్బుక్ ద్వారా సవాలు విసిరింది. మీరు ఇలా చేస్తే మరిన్ని ఆధారాలు బయటపెడతానని చెప్పారు. శ్రీరామకృష్ణన్ తనకు మెసేజ్‌లు పంపారని.. రహస్యంగా తన వ్యక్తిగత నివాసానికి ఆహ్వానించినట్లు స్వప్న సురేష్ గతంలో ఆరోపణలు చేసింది.
'ఇలానే చేస్తే మరిన్ని ఫొటోలు పోస్ట్ చేస్తా'.. లైంగిక వేధింపులపై మాజీ స్పీకర్‌కు స్వప్న సవాల్ - స్వప్న సురేశ్ మాజీ స్పీకర్ శ్రీధర్కృష్ణన్ కేసు
కేరళ మాజీ స్పీకర్, ఇద్దరు మాజీ మంత్రులు తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన స్వప్నా సురేశ్.. తాజాగా స్పీకర్ శ్రీరామకృష్ణన్ ఫొటోలు విడుదల చేసింది. 'సార్ ఇదే మీకు నా సమాధానం' మీకు ధైర్యం ఉంటే నాపైన పరువు నష్టం కేసు పెట్టాలని.. ఫేస్బుక్ ద్వారా సవాలు విసిరింది.
స్వప్న సురేశ్ శ్రీధర్కృష్ణన్
గత కొంత కాలంగా కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులపై స్వప్న తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 30కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్నా సురేశ్‌తోపాటు సందీప్ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ 2020 జులైలో కస్టడీలోకి తీసుకుంది. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్‌లో స్వప్న సురేశ్ విడుదలయ్యారు.