బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్.. సీపీఎం నాయకులపై తీవ్ర లైంగిక ఆరోపణలు చేసింది. రాష్ట్ర మాజీ మంత్రి కడకంపల్లి సురేంద్రన్, మాజీ స్పీకర్ శ్రీధర్కృష్ణన్ తనకు అసభ్యకర మెసేజ్‌లు పెట్టారని ఆరోపించింది. మాజీ మంత్రి థామస్ ఐజాక్ కూడా తనను హిల్ స్టేషన్‌కు పిలిచారని చెప్పింది. శుక్రవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పలు విషయాలపై మాట్లాడారు. స్వప్నా సురేశ్.. సీపీఐ నాయకులపై ఆరోపణలు చేసి 12 గంటలు గడుస్తున్నా ఆ పార్టీ నాయకులెవరూ ఇంతవరకు స్పందించలేదు.
గత కొంత కాలంగా కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులపై స్వప్న తీవ్ర ఆరోపణలు చేస్తోంది. 30కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్నా సురేశ్‌తోపాటు సందీప్ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ 2020 జులైలో కస్టడీలోకి తీసుకుంది. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్‌లో స్వప్న సురేశ్ విడుదలయ్యారు.