స్వామినారాయణ దేవాలయ ద్విశాబ్ది ఉత్సవాల కోసం ఓ వ్యక్తి.. ఏకంగా సంవత్సరానికి 30 కోట్ల టర్నోవర్ వచ్చే వ్యాపారాన్ని వదిలేశారు. పూర్తి వ్యాపారాన్ని సోదరుడికి అప్పగించి.. మూడు నెలల క్రితం స్వామినారాయణ దేవాలయ ఆలయానికి వచ్చారు. ఉత్సవ ఏర్పాట్లన్నింటినీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు రమేష్ భాయ్ దబాసియా. ఈయనతో పాటు వేల మంది భక్తులు దేవాలయానికి చేరుకుని ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 1500 మంది వాలంటీర్లు కూడా ఉత్సవ పనులు చేస్తున్నారు. గుజరాత్.. కచ్ జిల్లాలోని భుజ్ ప్రాంతంలో ఈ స్వామినారాయణ దేవాలయం ఉంది.
30 కోట్ల వ్యాపారం వదిలి..
రమేష్ భాయ్ దబాసియా.. భుజ్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. ఆఫ్రికా దేశాల్లో రమేష్ భాయ్‌కి చాలా వ్యాపారాలు ఉన్నాయి. గ్రానైట్, మార్బుల్, బ్లూ స్టోన్.. వంటి వాటిని వివిధ దేశాలకు దిగుమతి, ఎగుమతి చేస్తుంటారు. యంత్రాలను సైతం దిగుమతి, ఎగుమతి చేస్తారు. "నా కంపెనీ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ బ్లూ పెర్ల్ ఇంటర్నేషనల్. నా వార్షిక టర్నోవర్ సుమారు 25 నుంచి 30 కోట్లు ఉంటుంది." అని రమేష్ భాయ్ దబాసియా తెలిపారు. స్వామి నారాయణ దేవ్‌పై భక్తితో ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తన వ్యాపారాన్ని సోదరుడికి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.