తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించండి'

మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు సువేందు అధికారి. మమతపై ఉన్న ఆరు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని ఆరోపించారు.

Mamata nomination
'మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించండి'

By

Published : Mar 15, 2021, 5:40 PM IST

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించాలని డిమాండ్​ చేశారు ఆమె ప్రత్యర్థి, నందిగ్రామ్​ భాజపా అభ్యర్థి సువేందు అధికారి. నామపత్రాల్లో.. తనపై ఉన్న 6 క్రిమినల్​ కేసులను మమత వెల్లడించలేదని ఆరోపించారు.

ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అధికారి. అసోంలో మమతపై దాఖలైన 5 కేసులు, బంగాల్​లో సీబీఐ నమోదు చేసిన ఓ కేసు వివరాలను వెల్లడించలేదన్నారు.

"నందిగ్రామ్​ టీఎంసీ అభ్యర్థి, ముఖ్యమంత్రి తన అఫిడవిట్​లో.. ఆమెపై ట్రయల్​లో ఉన్న ఆరు కేసులను పేర్కొనలేదు. ఒకటి సీబీఐ కేసు, మరో ఐదు అసోంలో ఉన్నాయి. ఆమె నామినేషన్​ తిరస్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరాను. వారు అవసరమైన చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తాను. ఆ చర్యలు చట్టపరంగా ఉండాలి."

- సువేందు అధికారి, భాజపా నందిగ్రామ్​ అభ్యర్థి.

సువేందు ఫిర్యాదులో కేసులకు సంబంధించిన నంబర్లను పేర్కొన్నారని, అయితే.. టీఎంసీ అధినేత్రి చేసిన నేరాల గురించి వివరించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు.

సువేందు అధికారి ఫిర్యాదుపై ఇప్పటి వరకు టీఎంసీ నుంచి ఎలాంటి స్పందన లేదు.

అభ్యర్థులు తమ ఆస్తులు, క్రిమినల్​ కేసులపై వివరాలు దాచివేస్తే వారి నామినేషన్​ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై 2018మార్చిలో కీలక ఆదేశాలిచ్చింది. తమ అభ్యర్థి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన ప్రాథమిక హక్కు ఓటర్లకు ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:భాజపాకు అమ్మడం తప్ప నిర్మించడం రాదు: రాహుల్​

ABOUT THE AUTHOR

...view details