తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీఎంసీకి షాక్​- సువేందు దారిలోనే మరో ఇద్దరు - మమతా బెనర్జీ

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార టీఎంసీకి షాక్​ ఇస్తున్నారు నేతలు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకున్న సువేందు అధికారి తాజాగా పార్టీ సభ్యత్వంతో ఇతర పదవులకు రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు నాయకులు కీలక పదవుల నుంచి తప్పుకున్నారు.

Suvendu Adhikari quits TMC
తృణమూల్​ కాంగ్రెస్​

By

Published : Dec 17, 2020, 4:31 PM IST

రాజీనామాల పర్వంతో బంగాల్​ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కీలక నేత సువేందు అధికారి తాజాగా పార్టీ సభ్యత్వంతో పాటు ఇతర పదవులను వదులుకున్నారు. తన రాజీనామాను పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపారు.

సువేందు దారిలో..

సువేందు దారిలోనే నడుస్తున్నారు మరికొంత మంది టీఎంసీ నేతలు. పార్టీ సీనియర్​ నేత జితేంద్ర తివారి.. అసాన్సోల్​ మున్సిపల్​ కార్పొరేషన్​ బోర్డ్​ ఆఫ్​ అడ్మినిస్టేషన్​ ఛైర్మన్​ పదవికి రాజీనామా చేశారు.

అలాగే.. దక్షిణ బంగాల్​ రాష్ట్ర రవాణా కార్పొరేషన్​ (ఎస్​బీఎస్​టీసీ) ఛైర్మన్​ పదవికి రిడైర్ట్​ కల్నల్​ దిప్తాంగ్షు చౌదరి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పంపించారు.

ఇదీ చూడండి: దీదీకి షాక్​- ఎమ్మెల్యే పదవికి సువేందు రాజీనామా

ABOUT THE AUTHOR

...view details