బంగాల్లో రెండో దశ పోలింగ్లో భాగంగా.. నందిగ్రామ్ భాజపా అభ్యర్థి సువేందు అధికారి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయకర్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ బూత్ నెం.76లో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు వేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని కోరారు.
"దేశం మొత్తం నందిగ్రామ్ వైపు చూస్తున్నందున.. ప్రజలు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో రావాలని కోరుతున్నాను. అభివృద్ధి రాజకీయాలు గెలుస్తాయా? అసంతృప్తి కలిగించే రాజకీయాలు గెలుస్తాయా? అని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు."