కరోనా మహమ్మారి కారణంగా పలు అంతర్జాతీయ విమాన సేవల నిలిపివేతను జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం ప్రకటించింది. అయితే పలు మార్గాల్లో విమాన సేవలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.
ఈ రద్దు కేవలం ప్యాసింజర్ విమానాలపైనే అని డీజీసీఏ స్పష్టం చేసింది. కార్గో విమాన సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని తెలిపింది.