Suspense on Telangana New CM Candidate :రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని కాంగ్రెస్ సాధించి అధికారాన్ని చేజిక్కుంచుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 64 మందిని హైదరాబాద్ రప్పించి గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో ఉంచారు. కాగా సోమవారం ఉదయమే ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకునే ప్రక్రియ ఉంటుందని డీకే శివకుమార్ ప్రకటించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్ధి, ఉపముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్ష పదవి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ శాఖలు తదితర పదవులపై చర్చలు జరిపినట్లు సమాచారం.
సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానిదే - సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేల తీర్మానం
ఉప ముఖ్యమంత్రితో పాటు పీసీసీ పదవి తనకే ఇవ్వాలని ఓ సీనియర్ నాయకుడు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నాయకుడు ఉపముఖ్యమంత్రి ఇవ్వాలని పట్టుబట్టగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం లేదని అధిష్ఠానం స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ విషయం ఏఐసీసీ దృష్టికి వెళ్లడంతో సీఎల్పీ నేత ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Karnataka Deputy Minister DK Shivakumar)ను ఏఐసీసీ ఆదేశించినట్లు సమాచారం.
రాజ్భవన్లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్
సోమవారం జరిగిన సీఎల్పీ భేటీలో 3 తీర్మాణాలు చేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. సీఎల్పీ నేత, సీఎం అభ్యర్థి ఎంపిక అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మాణం చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల సేకరణలో దాదాపు 55మంది సీఎం అభ్యర్థిగా రేవంత్‌రెడ్డి వైపే మెుగ్గు చూపినట్లుగా సమాచారం. ఆ తీర్మానాన్ని దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఏఐసీసీ పరిశీలకులు(AICC Members in Delhi) పంపారు. అధిష్ఠానం నిర్ణయం మేరకు సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు.