దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉద్ధృతి దృష్ట్యా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న అన్నదాతలు.. నిరసనలు, ధర్నాలను విరమించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కోరారు. రైతులు, రైతుసంఘాల నాయకులు కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఉద్యమం వల్ల గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందుతుందన్నారు.
"ఉద్యమాన్ని కొనసాగించాలంటే.. పరిస్థితి అదుపులోకి వచ్చాక మళ్లీ ప్రారంభించండి. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఉద్యమం, ధర్నాలో పాల్గొంటున్నారు. దీనివల్ల పల్లెల్లో కరోనా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుత పరిస్థితిని రైతుసంఘాల నాయకులు అర్థం చేసుకోవాలి. రైతులు, రైతు నాయకులు కరోనా పరీక్షలు చేసుకోవాలి. లేకుంటే వైరస్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది?"