తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అది డ్రోన్ల రిమోట్ కంట్రోల్​ కాదు.. న్యూస్ పేపర్ల కట్ట!

జమ్ములోని వాయుసేన ఎయిర్​పోర్టుపై దాడి ఘటనలో సీసీటీవీ ఫుటేజ్​లో లభించిన ఆధారం కీలకమని భావించిన దర్యాప్తు సంస్థలకు నిరాశే మిగిలింది. ఓ ఫొటోలో కారు, బైక్​పై కన్పించిన ఇద్దరు వ్యక్తులు.. ఉగ్రవాదులు కాదని తేలినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా సీసీటీవీలో చూసి రిమోట్ కంట్రోల్ అనుకున్న ఓ వస్తువు.. న్యూస్​ పేపర్ల కట్ట అని రుజువైనట్లు పేర్కొన్నాయి.

Suspected remote control for drones in CCTV turns out to be bundle of newspaper
అది డ్రోన్ల రిమోట్ కంట్రోల్​ కాదు.. న్యూస్ పేపర్ల కట్ట!

By

Published : Jun 29, 2021, 8:20 PM IST

జమ్ములోని వాయుసేన స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన డ్రోన్ల దాడి ఘటన దర్యాప్తులో అధికారులకు నిరాశ ఎదురైంది. సీసీటీవీ ఫుటేజ్​లో లభించిన క్లూస్ కీలకమని భావించిన వారి అంచనా తప్పైంది. ఆ రోజు రాత్రి ఓ కారు, బైక్​పై కన్పించిన ఇద్దరు వ్యక్తులు.. ముందుగా అనుమానించినట్లు ఉగ్రవాదులు కాదని తేలినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

జమ్ములోని జాతీయ రహదారిపై ఉన్న వాయుసేన ఎయిర్​పోర్టుపై ఆదివారం అర్ధరాత్రి డ్రోన్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి 11:45 గంటలకు మొదటి పేలుడు, సోమవారం ఉదయం 2:40గంటలకు రెండో పేలుడు సంభవించాయి. ఆ రోజే రంగంలోకి దిగిన దర్యాప్తు బృందాలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాయి. సోమవారం 2:40 గంటలకు కొద్ది సేపటి ముందే కారులో వచ్చిన ఓ వ్యక్తి, బైక్​పై వచ్చిన మరో వ్యక్తిని కలిశాడు. అతనికి ఏదో వస్తువు ఇచ్చినట్లు సీసీటీవీలో రికార్డయింది. వీరిద్దరు ఉగ్రవాదులని, ఆ వ్యక్తి ఇచ్చిందని డ్రోన్ల రిమోట్ కంట్రోల్ అని అధికారులు అనుమానించారు. వెంటనే వారిద్దరిని ట్రేస్ చేసి విచారించారు.

డ్రోన్ల రిమోట్ కాదు.. పేపర్ల కట్ట..

అయితే విచారణలో అధికారులు ఊహించని విధంగా వారిద్దరూ ఉగ్రవాదులు కాదని తేలింది. కారులో వచ్చిన వ్యక్తి స్థానిక వార్తా పేపర్​ పంపిణీదారు అని, బైక్​పై ఉంది పేపర్ విక్రయదారు అని రుజువైంది. ఇక డ్రోన్ల రిమోట్ కంట్రోల్ అని భావించిన వస్తువు న్యూస్​ పేపర్ల కట్ట అని తెలిసింది. దీంతో చేసేదేం లేక అధికారులు ఇతర క్లూస్​ను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

ఆదివారం అర్ధరాత్రి కల్చుక్ వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్ల దాడి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ తరహా దాడి జరగడం ఇదే మొదటి సారి కావడం వల్ల అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆ మరునాడే మరో డ్రోన్​ కూడా జమ్ములో సంచరించడం తీవ్ర కలకలం రేపింది.

ఇదీ చూడండి: జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం​- సైన్యం అప్రమత్తం

ABOUT THE AUTHOR

...view details