అసోం డిమా హాసాఓ జిల్లా డియుంగ్ ముఖ్లో బొగ్గు లోడుతో ఉన్న ఏడు ట్రక్కులకు నిప్పంటించారు కొందరు దుండగులు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సజీవదనమయ్యారు. ట్రక్కులన్నీ కాలి బూడిదయ్యాయి. డీఎన్ఎల్ఏ ఉగ్రసంస్థకు చెందిన సభ్యులే ఈ దుశ్యర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రెేంజర్బిల్ ప్రాంతంలో ఆగంతుకులు తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చనిపోయిన ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కులలో మొత్తం 10 మంది ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.