తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో అనుమానిత డ్రోన్​- పోలీసులు అప్రమత్తం - కశ్మీర్​లో డ్రోన్​

జమ్ముకశ్మీర్​లో మరో అనుమానిత డ్రోన్​ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పోలీసులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

Drone
డ్రోన్​

By

Published : Aug 3, 2021, 12:50 PM IST

గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్​లో అనుమానిత డ్రోన్ల సంచారం పెరిగింది. తాజాగా సోమవారం రాత్రి.. సాంబా జిల్లాలో మరో అనుమానిత డ్రోన్​ కదలికను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. అంతకుముందు రోజు (ఆదివారం) అర్ధరాత్రి నాలుగు ప్రాంతాల్లో డ్రోన్లను గుర్తించినట్లు వివరించారు. శుక్రవారం రాత్రి కూడా డ్రోన్ల సంచారం కలకలం రేపింది.

డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, ఐఈడీలు, మాదకద్రవ్యాలను చేరవేయడం వెనుక పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా, జైషే ఉగ్ర సంస్థలు ఉన్నాయని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. యాంటీ డ్రోన్​ చర్యలను ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

ABOUT THE AUTHOR

...view details