తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకేసారి స్టేషన్​లోని 66 మంది పోలీసులు బదిలీ.. కారణమిదే.. - కేరళ పోలీస్ కస్టడీ కేసు

Kerala police custody death: పోలీస్​ కస్టడీ నుంచి విడుదలైన వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన కేసులో కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న స్టేషన్ హౌస్​​ ఆఫీసర్ సహా 66 మంది పోలీసులను బదిలీ చేసింది.

kerala police custody death
kerala police custody death

By

Published : Jul 26, 2022, 5:05 PM IST

Kerala police custody death: కేరళ కోజికోడ్​లో పోలీస్​ కస్టడీ మృతి కేసులోని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న స్టేషన్ హౌస్​​​ ఆఫీసర్ సహా 66 మంది పోలీసులను బదిలీ చేసింది. గత వారం పోలీస్​ కస్టడీ నుంచి విడుదలైన 42 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పినరయి విజయన్​ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అంతకుముందే రూరల్​ ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు.. ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్​ చేశారు కన్నూర్​ డీఐజీ.

గతవారం వటకర సమీపంలోని తెరువాత్​లో సంజీవన్​ అనే వ్యక్తి కారు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని సంజీవన్​ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే అస్వస్థతకు గురైన సంజీవన్​ను పోలీసులు వేధించారన్నది ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత విడుదల చేయగా సంజీవన్​ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో సమీప ఆస్పత్రికి తరలించారు స్నేహితులు. అప్పటికే అతడు​ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. సంజీవన్​ అస్వస్థతకు గురైనా పోలీసులు పట్టించుకోలేదని.. ఆస్పత్రికి తరలించడానికి ఎవరూ సహకరించలేదని అతడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది​.

ABOUT THE AUTHOR

...view details