తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7 గంటల్లో 7 వేల కిలోల వంటకం చేసి రికార్డు - మాస్టర్ చెఫ్ విష్ణు మనోహర్

మహారాష్ట్ర పుణెలో ఓ అరుదైన కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు సాధించింది సూర్యదత్త గ్రూప్​ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్. ఏకంగా 7,000 కేజీల 'పుణెరి మిసల్' వంటకాన్ని చేయించింది.

suryadatta maha misal world record event in pune
7 గంటల్లో 7వేల కేజీల వంటకం చేసి రికార్డు

By

Published : Mar 14, 2021, 5:18 PM IST

Updated : Mar 14, 2021, 7:26 PM IST

పుణెరి మిసల్​ వంటకం తయారీతో రికార్డు

మహారాష్ట్ర పుణెలో 7 గంటల్లో 7,000 కేజీల 'పుణెరి మిసల్' వంటకాన్ని చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. 30 మంది చేసిన ఈ వంటకాన్ని కేవలం మూడు గంటల్లోనే 30,000 మంది పేదలకు పంచిపెట్టారు. 300 స్వచ్ఛంద సంస్థల పేరిట ఈ పంపిణీ చేయడం విశేషం.

సూర్యదత్త గ్రూప్​ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్, చెఫ్ విష్ణు మనోహార్ ఆధ్వర్యంలో 'సూర్యదత్త విష్ణు మహా మిసల్ వరల్డ్ రికార్డు 2021 ఫెస్టివల్​' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే.. ఇది విష్ణు మనోహర్​ సాధించిన పదో రికార్డు కావడం గమనార్హం.

వంటకానికి సిద్ధం చేసిన మొలకెత్తిన గింజలు
వరల్డ్ రికార్డు ఈవెంట్
7 గంటల్లోనే 7వేల కేజీల పుణెరి మిసెల్ తయారు చేసి

గతంలో.. అతిపెద్ద పరోటా, 5000 కేజీల కిచిడీ, కెబాబ్, వంటివి చేసి విష్ణు మనోహర్ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఇవేకాక, దేశవ్యాప్తంగా పలు వంటకాలు చేశారు.

30 మందితో రికార్డు
పుణెరి మిసల్

మిసల్​ అనేది ముంబయిలో మంచి పేరున్న స్ట్రీట్ ఫుడ్. అయితే.. కొవిడ్​-19 వ్యాప్తి దృష్యా 7 వేల కేజీల మిసల్​ను తయారు చేసే కార్యక్రమంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 3 గంటలకే ఈ వంటకం చేయడం ప్రారంభించామని, ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరయ్యే సౌలభ్యాన్ని కల్పించినట్లు తెలిపింది.

ఇదీ చదవండి:కొట్టేసిన కార్డులతో రూ.2 కోట్ల ఆన్​లైన్​ షాపింగ్​!

Last Updated : Mar 14, 2021, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details