దేశ సరిహద్దుల వద్ద అలజడి సృష్టించేందుకు నిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్‌కు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah News) గట్టి హెచ్చరిక జారీ చేశారు. గోవాలోని (Goa Latest News)ధర్-బందోరాలో జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి అమిత్ షా శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ (Pakistan Latest News) పేరు ఎత్తకుండానే ఆ దేశానికి గట్టి సందేశం పంపారు. సరిహద్దుల వద్ద ఆటంకాలు సృష్టిస్తే మళ్లీ మెరుపుదాడులు తప్పవని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలో మెరుపుదాడులు (Surgical Strike News) జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ దాడుల ద్వారా సరిహద్దుల రక్షణలో భారత్ వైఖరిని ప్రపంచానికి గట్టిగా చాటిచెప్పిందని షా తెలిపారు.
'మరోసారి మెరుపుదాడులు తప్పవు'- పాక్‌కు షా హెచ్చరిక!
సరిహద్దుల వద్ద ఆటంకాలు సృష్టిస్తే మళ్లీ మెరుపుదాడులు తప్పవని పాకిస్థాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah News). సరిహద్దుల వద్ద సమస్య అనే ప్రశ్న తలెత్తితే అందుకు అనుగుణంగానే జవాబిస్తామని స్పష్టంచేశారు.
"అనేక సంవత్సరాల పాటు చొరబాటుదారులు మన సరిహద్దులను దాటుకుని దేశంలోకి వచ్చేవారు. అనేక రకాల హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉండేవి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారు. కానీ తగిన విధంగా వ్యవహరించండి అని దిల్లీ నుంచి జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి వినతి పంపడం తప్ప మరే చర్యలు తీసుకునేవారు కాదు. జమ్ముకశ్మీర్ సరిహద్దుల వద్ద, పుంఛ్ వద్ద దాడి జరిగినపుడు మన సైనికులు మరణించారు. వారిని సజీవ దహనం చేశారు. అప్పుడే మొదటి సారి మెరుపుదాడులు జరిపి సరిహద్దుల వద్ద అలజడి సృష్టించడం అంత సులభం కాదని ప్రపంచానికి భారత్ చాటిచెప్పింది. గతంలో చర్చల ద్వారా పని జరిగేది. కాని ఇప్పుడు సరిహద్దుల వద్ద సమస్య అనే ప్రశ్న తలెత్తితే అందుకు అనుగుణంగానే జవాబిస్తాం." అని (Amit Shah News) షా అన్నారు.
ఇదీ చూడండి:ఆ మూడు రాష్ట్రాల్లో బీఎస్‌ఎఫ్ అధికార పరిధి పెంపు