తెలంగాణ

telangana

ETV Bharat / bharat

101 అడుగుల కాన్వాస్​పై 'బొమ్మల రామాయణం' - రామాయణం పెయింటింగ్

రామాయణ కథలు వర్ణిస్తూ అద్భుతమైన పెయింటింగ్​ వేసింది గుజరాత్​కు చెందిన ఓ యువతి. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటుసంపాదించింది.

ramayana
రామాయణం, కాన్వాస్​ పెయింటింగ్

By

Published : Aug 12, 2021, 5:10 PM IST

101 అడుగులు కాన్వాస్​పై రామాయణం పెయింటింగ్

రామాయణం చదవమంటేనే చాలా మంది యువత విముఖత చూపుతారు. అలాంటిది ఏకంగా రామాయాణంలోని సన్నివేశాలను వర్ణించేలా బొమ్మలు గీయమని చెబితే.. అది అసలు సాధ్యమయ్యే పనేనా? అన్నట్లు మొహం పెడతారు. కానీ, ఇది నిజం చేసి చూపించింది గుజరాత్​లోని సూరత్​​కు చెందిన 17 ఏళ్ల యువతి జాన్వీ వెకారియా. ఏకంగా 101 అడుగుల కాన్వాస్​పై పెయింటింగ్​ వేసి ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్​లో చోటు సంపాదించింది. రాముడి పుట్టుక నుంచి మొదలుకొని రావణ వధ వరకు 15 సన్నివేశాలను అద్భుతంగా గీసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

"టీవీలో వచ్చే రామాయణం సీరియల్ చూసేదాన్ని. రామాయణం కథల పుస్తకాలు చదివేదాన్ని. అందులో నాకు చాలా అంశాలు నచ్చాయి. రాముడి నుంచి సహనం అంటే ఏంటో తెలుసుకోవచ్చు. రామాయణం చదివాక.. సత్యం కోసం జీవించాలి. సత్యం కోసం పోరాడాలనే విషయం మనకు తెలుస్తుంది."

--జాన్వీ వెకారియా, పెయింటర్.

చిన్నప్పటి నుంచి చిత్రలేఖనంపై ఉన్న మక్కువ వల్ల.. ఈ స్క్రోలింగ్​ పెయింటింగ్ ఆలోచన తనకు వచ్చినట్లు చెప్పింది జాన్వీ. తన తల్లిదండ్రులు కూడా కళాకారులు​ కావడం వల్ల బొమ్మలు గీయడంపై మరింత ఆసక్తి పెరిగినట్లు తెలిపింది. ఈ 101 అడుగుల కాన్వాస్​ పెయింటింగ్​ను 9వ తరగతిలోనే ప్రారంభించి.. కరోనా లాక్​డౌన్​ సమయంలో దొరికిన 5 నెలల వ్యవధిలో పూర్తి చేసినట్లు చెప్పింది.

రావణ వధను వర్ణిస్తూ గీసిన పెయింటింగ్

తమ కూతురు ఈ పెయింటింగ్​ వేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు జాన్వీ తల్లిదండ్రులు.

"9వ తరగతిలో పెయింటింగ్ ప్రారంభించినప్పుడు తను ఇంత పెద్ద పెయింట్ వేస్తుందని ఊహించలేదు. కానీ, ఇది పూర్తి చేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది."

--విభా వెకారియా, జాన్వీ తల్లి.

మొత్తం రామాయణం ఒకే చోట వర్ణించేలా ఉన్న ఈ పెయింటింగ్​ను అయోధ్య రామమందిరంలో ప్రదర్శనకు ఉంచాలని ఆశిస్తున్నట్లు జాన్వీ తెలిపింది. ఇందుకోసం ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను కలుస్తానని అంటోంది.

పెయింటింగ్​ వేస్తున్న జాన్వి

ఇదీ చదవండి:దేశీయ తొలి డ్రైవర్​లెస్ విద్యుత్ వాహనం వచ్చేసింది

ABOUT THE AUTHOR

...view details