తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచ వజ్రాల కేంద్రంగా భారత్- సూరత్ డైమండ్ మార్కెట్​ ఒక మోదీ గ్యారంటీ! : ప్రధాని మోదీ - సూరత్​ డైమండ్​ బోర్స్​ నిర్మాణ వ్యయం

Surat Diamond Bourse Inauguration : ప్రపంచంలోనే అతిపెద్దదైన సూరత్​ డైమండ్ బోర్స్​ను ఆదివారం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇది మోదీ గ్యారంటీకి ఒక ఉదాహరణ అని అన్నారు. దీని గురించి ఎవరైనా మాట్లాడితే సూరత్​, భారత్​ ప్రస్తావన వస్తుందన్నారు.

Surat Diamond Bourse Inauguration
Surat Diamond Bourse Inauguration

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 11:24 AM IST

Updated : Dec 17, 2023, 2:14 PM IST

Surat Diamond Bourse Inauguration : ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన సూరత్​ డైమండ్​ బోర్స్-ఎస్​డీబీ మోదీ గ్యారంటీకి ఒక ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ భవనం సరికొత్త భారత్​ నూతన శక్తి, సంకల్పానికి నిదర్శనం అని అభివర్ణించారు. ఈ మేరకు సూరత్​ డైమండ్​ మార్కెట్​ను ఆదివారం ప్రారంభించిన మోదీ ఆ తర్వాత జరిగిన సభలో మాట్లాడారు. మోదీ 3.0 ప్రభుత్వంలో భారత్ ప్రపంచంలోని ​మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంటుందని తాను గ్యారంటీ ఇచ్చానని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం రాబోయే 25 ఏళ్లకు లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. సూరత్ డైమండ్ బోర్స్​ భారతీయ డిజైనర్లు, మెటీరియల్స్​, భావనల సామర్థ్యాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, ఈ కొత్త మార్కెట్‌ (ఎస్​డీబీ)తో మరో 1.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.

"సూరత్ వైభవానికి మరో వజ్రం తోడైంది. ఈ వజ్రం చిన్నది కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ప్రపంచంలోని అతిపెద్ద భవనాలు కూడా ఈ వజ్రం మెరుపు ముందు తేలిపోయాయి. ప్రపంచంలో ఈ డైమండ్ బోర్స్ గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా సూరత్, భారత్​ ప్రస్తావన వస్తుంది."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని

Surat Diamond Bourse Building : డైమండ్‌ కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా 65వేల మంది వజ్రాల నిపుణులు ఈ కాంప్లెక్స్‌ కేంద్రంగా పనిచేయనున్నారు. ఇది రఫ్​, మెరుగుపెట్టిన వజ్రాలు అలాగే ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా ఉండనుంది. వజ్రాల ఎగుమతి, దిగుమతుల కోసం అత్యాధునిక కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, రిటైల్ ఆభరణాల వ్యాపారం కోసం జ్యువెలరీ మాల్, అంతర్జాతీయ బ్యాంకింగ్, సురక్షితమైన వాల్ట్‌లు వంటి సౌకర్యాలతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ అతిపెద్ద కార్యాలయ సముదాయం ప్రపంచవ్యాప్తంగా డైమండ్‌ కట్టింగ్‌ క్యాపిటల్‌గా సూరత్‌ పేరును సుస్థిరం చేయనుంది. దాదాపు రూ.3,400 కోట్ల వ్యయంతో 35.54 ఎకరాల్లో హరిత భవనంగా నిర్మించిన ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యాధునిక హంగులతో రూపొందిన ఈ భవనం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Surat Airport New Terminal Opening :ఎస్​డీబీతో పాటు కొత్తగా నిర్మించిన సూరత్​ ఎయిర్​ పోర్టు టెర్మినల్ బిల్డింగ్​ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్ రద్దీ సమయాల్లో 1200 మంది దేశీయ, 600 విదేశీ ప్రయాణికులను హ్యాండిల్ చేయగలదు. ఏడాదికి 55 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా నిర్మించారు. విమానాశ్రయ టెర్మినల్​ ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ సూరత్​ నగరంలో రోడ్​ షో నిర్వహించారు.

"ఈరోజు సూరత్ ప్రజలకు, ఇక్కడి వ్యాపారులకు మరో రెండు కానుకలు అందుతున్నాయి. ఈరోజే సూరత్ ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్‌ ప్రారంభమైంది. దీంతోపాటు సూరత్ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ విమానాశ్రయం హోదా దక్కడం రెండో పెద్ద విషయం. ఈ అద్భుతమైన టెర్మినల్, అంతర్జాతీయ విమానాశ్రయం కోసం నేను సూరత్ ప్రజలను మరియు గుజరాత్ ప్రజలను అభినందిస్తున్నాను."
--నరేంద్ర మోదీ, ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ భారత్​లో.. పెంటగాన్​ను మించి 'సూరత్​ డైమండ్స్'​ మార్కెట్

అతిపెద్ద డైమండ్​ మార్కెట్​ సూరత్​లో

Last Updated : Dec 17, 2023, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details