కరోనా టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు గుజరాత్ రాజ్‌కోట్‌కు చెందిన స్వర్ణకారుల సంఘం ఏకంగా బంగారాన్నే పంచిపెడుతోంది. తమ శిబిరంలో టీకా తీసుకుంటే మహిళలకు ముక్కుపుడక కానుకగా ఇస్తోంది. పురుషులకు హ్యాండ్ బ్లెండర్ ఉచితంగా అందిస్తోంది.
టీకా తీసుకుంటేనే డ్యూటీకి...
సూరత్‌లోని ఓ వస్త్ర సంస్థ తమ ఉద్యోగులకు ఉచితంగా కరోనా టీకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. టీకా తీసుకోవడానికి నిరాకరించినవారు ప్రతి మూడు రోజులకొకసారి కొవిడ్ పరీక్ష చేయించుకోవడాన్ని తప్పనిసరి చేసింది.
"కొవిడ్ మహమ్మారి దేశంలో ప్రకంపనలు రేపుతోంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లోనూ టీకా డ్రైవ్‌లను నిర్వహిస్తున్నందుకు భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మా సంస్థలో 6000మంది ఉద్యోగులకు ఉచితంగా టీకా అందించే కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ఉద్యోగులు వ్యాక్సిన్ అయినా తీసుకోవాలి లేదా ప్రతి మూడు రోజులకొకసారి కరోనా పరీక్షలైనా చేయించుకోవాలి. లేదంటే.. పనిచేయడానికి పరిశ్రమలోకి అనుమతి ఉండదనే నియమాన్ని విధించాము. ఇలా అయితే.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకుంటారని భావించాము."