తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐ, ప్రతివాదులకు సుప్రీం నోటీసులు - ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ

MLA's Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సీబీఐ, ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జులై 31కి వాయిదా వేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 17, 2023, 1:58 PM IST

Updated : Mar 18, 2023, 6:13 AM IST

MLA's Poaching Case Update : ఎమ్మెల్యేలకు ఎర కేసులో రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సీబీఐ, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. సీబీఐ దర్యాప్తు నిలిపివేయాలన్న ఆదేశాలపై నోటీసులు ఇవ్వలేదని న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు దర్యాప్తు నిలిపివేయాలని గతంలో ఆదేశాలు ఇచ్చారు. దర్యాప్తు నిలిపివేయాలని పోలీసులు, సీబీఐకి గత విచారణలో ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో కేంద్రం, సీబీఐ తరఫున ఎవరూ హాజరుకాలేదన్న దుష్యంత్ దవే తెలిపారు. ఇరు వాదననలు విన్న సుప్రీం కోర్టు... కేంద్రం మినహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ జులై 31వ తేదీకి వాయిదా వేసింది.

ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ విచారణపై స్టే ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకు వెళ్లిన సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం ఇటీవల నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్ లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామని పేర్కొంది. అప్పటి వరకు యథాతథస్థితి కొనసాగుతుందని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్యేల ఎర కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. అయితే విచారణ పారదర్శకంగా జరగడం లేదన్న ఆరోపణలతో సిట్‌ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. విచారణ జరపాలని సీబీఐని ఆదేశించారు. దీనిపై స్టే ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం వద్దకు వెళ్లింది. వాదనల సందర్భంగా.. క్రిమినల్‌ కేసులకు సంబంధించి సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పులను విచారించే పరిధి ధర్మాసనానికి ఉండదని హైకోర్టు తెలిపింది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించడంతో ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇక ఈకేసులో ఈరోజు కూడా వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ కేసులో సీబీఐ సహా ఇతర ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. కేంద్రం మినహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుపై తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది సర్వోన్నత న్యాయ స్థానం.

ఇవీ చూడండి..

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగింతపై సుప్రీంలో సవాల్

'బీజేపీ పంజరంలో సీబీఐ చిలుక'.. సుప్రీంలో ఎమ్మెల్యేలకు ఎర కేసు వాదనలు

Last Updated : Mar 18, 2023, 6:13 AM IST

ABOUT THE AUTHOR

...view details