వివిధ కేసుల్లో శిక్షలు పడిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించడంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. అలాంటి నేతలపై జీవిత కాల నిషేధం గురించి గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో జాప్యాన్ని నివారించాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణలో జాప్యంపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది.
ప్రజా ప్రతినిధులపై కేసుల దర్యాప్తులో జాప్యాన్ని నివారించాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్ధలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విచారణలో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. కొందరు నేతలపై కేసుల విచారణ 10 నుంచి 15ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటోందని వ్యాఖ్యానించింది. ఈ రెండు దర్యాప్తు సంస్ధలు కేవలం ఆస్తులను జప్తు చేసి సరిపెడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది.
అదే ప్రధాన సమస్య..