వరకట్నం కోసం భార్యలను వేధిస్తున్న, వారిని విడిచిపెడుతున్న ఎన్ఆర్ఐ భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై జులై నెలలో వాదనలు ఆలకించనున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ దావాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రవాసీ లీగల్ సెల్, మరికొన్ని సంస్థలు వీటిని దాఖలు చేశాయి.
భార్యలను తీసుకెళ్లని ఎన్ఆర్ఐ భర్తలపై వ్యాజ్యం - supreme court on dowry
వరకట్నం కోసం భార్యలను వేధిస్తున్న ఎన్ఆర్ఐ భర్తలను అరెస్ట్ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలను జులైలో విచారించనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తప్పించుకొని తిరుగుతున్న భర్తలను తిరిగి రప్పించేందుకు లుక్అవుట్ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌దారులు కోరారు.
![భార్యలను తీసుకెళ్లని ఎన్ఆర్ఐ భర్తలపై వ్యాజ్యం sc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11118806-thumbnail-3x2-sc.jpg)
భార్యలను తీసుకెళ్లని ఎన్ఆర్ఐ భర్తలపై వ్యాజ్యం
తప్పించుకొని తిరుగుతున్న భర్తలను తిరిగి రప్పించేందుకు లుక్అవుట్ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌దారులు కోరారు. రాయబార కార్యాలయాల ద్వారా అలాంటి వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కూడా సూచించారు. కొంతమంది భారీగా కట్నాలు తీసుకొని, ఘనంగా పెళ్లి చేసుకొని ఆయా దేశాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. భార్యకు వీసా, టిక్కెట్లు పంపిస్తామని చెప్పి తరువాత ముఖం చూపడం లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'వారికి ఉచితంగా న్యాయసేవలు అందించండి!'