జాతీయ స్థాయిలో రాజకీయ దుమారానికి కారణమైన పెగసస్ నిఘా వ్యవహారంపై(Pegasus Snooping) ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం వాదనలు ఆలకించనుంది.
ఈ నెల 5న పెగసస్ వ్యవహారంపై సుప్రీం విచారణ
దేశంలో దుమారం రేపిన పెగసస్ వ్యవహారంపై ఆగస్టు 5న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి పెగసస్‌ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను విచారించనుంది.
పెగసస్‌పై ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. ప్రముఖ పాత్రికేయులు ఎన్.రామ్, శశికుమార్ సహా సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, న్యాయవాది ఎం.ఎల్.శర్మ సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. గత నెల 30న న్యాయవాది కపిల్ సిబల్.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద ఈ పిటిషన్ను ప్రస్తావించారు. పెగసస్ వ్యవహారంతో(Pegasus News) కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని, అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. సిబల్ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. వచ్చే వారం వాదనలు వింటామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:'పెగసస్' దుర్వినియోగంపై చర్యలు- ఆ దేశాలపై నిషేధం!