నూతన సాగుచట్టాలపై సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయంలో రైతులు, కేంద్రప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగే దాకా స్టే విధిస్తామని సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. సాగుచట్టాల రద్దు సహా రైతుల ఆందోళనలు సవాలు చేస్తూ దాఖలైన వ్యాజాలపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం.. కేంద్రం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. రైతులతో జరుగుతున్న చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది.
సాగుచట్టాలపై నేడు సుప్రీంకోర్టు తీర్పు - farmers protest updates
కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై మంగళవారం తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. సోమవారం విచారణ సందర్భంగా రైతులతో కేంద్రం జరుపుతున్న చర్చలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. సాగుచట్టాల అమలును కొంత కాలం కేంద్రం నిలిపివేయకుంటే తామే స్టే ఇస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
సాగుచట్టాల అమలును కొంత కాలం కేంద్రం నిలిపివేయకుంటే తామే స్టే ఇస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వం సహా రైతు ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తామని పేర్కొంది. ఈ కమిటీ చట్టాలపై స్టే విధించాలని సూచిస్తే ఆ మేరకు ఆదేశాలిస్తామని వివరించింది. అన్ని అంశాలపై మంగళవారం తగిన ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.
ఇదీ చూడండి: తొలి దశలో టీకా ఫ్రీ- త్వరలో 4 వ్యాక్సిన్లు: మోదీ