Congress Leader Siddhu: పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మూడు దశాబ్దాల నాటి రోడ్ రేజ్ కేసులో సిద్ధూకు ఒక సంవత్సరం శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
30 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసులో సిద్ధూ నేరస్థుడు అనడానికి తగిన ఆధారాలేవీ లేవనే కారణంతో 2018 మేలో సుప్రీంకోర్టు ఆయనకు జైలు శిక్ష లేకుండా కేవలం 1000 రూపాయలు జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన బాధితుడి కుటుంబం.. మరోసారి అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సుప్రీం.. మరోసారి సిద్ధూ కేసుపై దృష్టిసారించింది. 1998 నాటి కేసులో సిద్ధూ నేరస్థుడేనా, కాదా అనే కోణంలో మరోసారి విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో ఆయనను నేరస్థుడిగా పరిగణించిన సుప్రీం కోర్టు.. సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఈ తీర్పుపై సిద్ధూ స్పందించారు. కోర్టు ఇచ్చిన తీర్పుకు శిరసావహిస్తానంటూ ట్వీట్ చేశారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష.. కారణమిదే?
Congress Leader Siddhu: పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. ముప్పై ఏళ్ల క్రితం నాటి ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో ఈ తీర్పు వెలువరించింది.
ఏంటీ కేసు..1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంపై 65ఏళ్ల గుర్నామ్ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్‌లకు మధ్య ఘర్షణ జరిగింది. గుర్నామ్ సింగ్‌ను కారు నుంచి బయటకు లాగి సిద్దూ- రూపిందర్ సింగ్ సంధు అతడి తలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన గుర్నామ్ సింగ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆ సమయంలో బాధితుడి కుటుంబ సభ్యులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:జ్ఞాన్వాపి సర్వేలో సంచలన నిజాలు.. మసీదులో హిందూ దేవతల విగ్రహాలు!