అటవీశాఖ అధికారులపై సాయుధ వేటగాళ్లు, స్మగ్లర్లు చేస్తున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. వారి నుంచి రక్షణ పొందేందుకు అవసరమైతే తుపాకులు, బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు, శిరస్త్రాణాలను అందించే ఉత్తర్వులనూ జారీ చేయొచ్చని పేర్కొంది.
ఈ మేరకు టీఎన్ గోదావర్మన్ తిరుముల్పాద్ దాఖలు చేసిన 25 ఏళ్ల నాటి ఓ మధ్యంతర పిటిషన్ను విచారించింది న్యాయస్థానం. అంతేకాకుండా.. అటవీశాఖ అధికారులపై జరిగే దాడుల్లో 38 శాతం భారత్లోనే నమోదయ్యాయని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ఓ నివేదికను సమర్పించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అడవుల్లో జరిగిన దారుణమైన దాడులు, వారిపై నమోదైన ఎన్కౌంటర్ కేసులను అందులో ప్రస్తావించారాయన. వాటిని కూడా సుప్రీం ధర్మాసనం పరిశీలించింది.
'ప్రత్యేక ఈడీ ఏర్పాటు..'
'అటవీశాఖపై పెద్ద పెద్ద శక్తులు దాడి చేసి మిలియన్ల డాలర్ల సంపదను దోచుకుంటున్నాయి-వీరిపై అటవీ శాఖ అధికారులు పోరాడుతున్నారు' అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అటవీ శాఖపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, వీటిపై ఈడీ దృష్టి సారించాలని చెప్పింది. నిరాయుధులుగా ఉన్న అటవీ అధికారులు.. వారిని వారు ఎలా కాపాడుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఆ నివేదిక తర్వాతే..