Supreme Court: సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆ నిర్మాణాలపై ఎన్జీటీ స్టే ఎత్తివేతకు నిరాకరణ - undefined
![Supreme Court: సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. ఆ నిర్మాణాలపై ఎన్జీటీ స్టే ఎత్తివేతకు నిరాకరణ Supreme Court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18525490-621-18525490-1684312855987.jpg)
14:09 May 17
ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి నిర్మాణాలపై గతంలో స్టే ఇచ్చిన ఎన్జీటీ
A setback for the AP government in the Supreme Court : జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానాపై సవాలు చేసిన ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి నిర్మాణాలపై గతంలో ఎన్జీటీ స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరించింది. 3 రిజర్వాయర్ల నిర్మాణాల విషయమై నిబంధనలు ఉల్లంఘించారని హరిత ట్రిబ్యునల్ గతంలో రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కొత్త రాష్ట్రంపై రూ.100కోట్ల జరిమానా భారం అవుతుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది రోహత్గీ పేర్కొన్నారు. దీంతో పాక్షికంగా స్టే ఇచ్చిన సుప్రీం ధర్మాసనం... ప్రస్తుతం రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో చెల్లించాలని ఆదేశించింది. ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్ధమని ప్రశ్నించింది.
ఇవీ చదవండి :
TAGGED:
supreme on ap govt