ఓ విద్యార్థిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా (పిల్) మారింది. పాఠశాలలు తెరిచినా కోర్టుల్లో విచారణకు విముఖత ఎందుకు అంటూ ఓ విద్యార్థిని రాసిన లేఖను సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ పిల్‌గా పరిగణించారు.
బార్ అసోసియేషన్ శుక్రవారం నిర్వహించిన సీజేఐ సన్మాన కార్యక్రమంలో జస్టిస్ వినీత్ శరణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. "పాఠశాలలు తెరిచినప్పుడు కోర్టులు ఎందుకు తెరవరు. భౌతిక పద్ధతిలో పాఠశాలలు తెరిచారు. కానీ కోర్టులు ఇప్పటికీ ఆ పద్ధతికి సుముఖత చూపడం లేదు ఎందుకు" అని ఆ విద్యార్థిని సీజేఐకు లేఖ రాశారని ఆయన తెలిపారు. ఆమె లేఖనే సీజేఐ పిల్‌గా పరిగణించారని, త్వరలోనే ఆ పిటిషన్ విచారణ కొనసాగుతుందని జస్టిస్ వినీత్ శరణ్ వెల్లడించారు.