జాతీయ క్రీడగా హాకీని(national game of india) ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు. ఈ విషయంలో కోర్టు ఏమీ చేయలేదని స్పష్టం చేసింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని లేదంటే తామే కొట్టేస్తామని పిటిషనర్‌కు సూచించింది.
దేశానికి జాతీయ జంతువు ఉన్నట్లుగానే.. జాతీయ క్రీడ లేదని, హాకీని నేషనల్ గేమ్‌గా ప్రకటించాలని కోరుతూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు పిటిషనర్ విశాల్ తివారీ. హాకీ గతంలో దేశ గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లినా.. సరైన స్థానం లభించలేదని పేర్కొన్నారు. క్రికెట్‌తో పోలిస్తే.. హాకీకి ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించటం లేదని కోర్టుకు తెలిపారు.
"భారత్‌లో హాకీ చరిత్ర మొత్తం దేశానికి గర్వకారణం. హాకీలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. కానీ కొన్నాళ్లుగా వెనకబడింది. 41 ఏళ్లుగా ఒలింపిక్ మెడల్ సాధించకపోవటం దురదృష్టకరం. 2020 టోక్యో ఒలిపింక్స్‌లో దేశం కాంస్య పతకం సాధించింది. "