ట్రాక్టర్ ర్యాలీలో హింసపై పిటిషన్లు తిరస్కరణ - delhi tractor rally violence news
12:20 February 03
ట్రాక్టర్ ర్యాలీలో హింసపై పిటిషన్లు తిరస్కరణ
రిపబ్లిక్ డే రోజు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉటంకించింది. సున్నితమైన అంశంపై కేంద్రం చట్టపరంగా స్పందిస్తుందని సీజేఐ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అందువల్ల తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
సాగుచట్టాలపై రాజ్యసభలో ఓటింగ్ సరైన పద్ధతిలో జరగలేదని మరో పిటిషనర్ పేర్కొనగా.... ఆ అంశంపై వేరుగా పిటిషన్ వేయాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
ఇదీ చూడండి: దీప్ సిద్ధూపై సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు